Sunday, 29 April 2018

హమాలీల న్యాయమైన హక్కుల సాధన కోసమే సమ్మె ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

   కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 29 ;  హమాలీల హక్కుల సాధన కోసమే మే 1 నుండి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు.  ఆదివారం   ఆసిఫాబాద్ లో ఏర్పాటు చేసిన  విలేఖరుల  సమావేశంలో మాట్లాడారు.  ఏఐటీయూసీ అద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా హమాలీల సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తుదని అన్నారు. ప్రభుత్వం వెంటనే రేట్లు  పెంచాలని, హమాలీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని,జీవో నెం.28 ప్రకారం ఈ ఎస్ ఐ , పిఎఫ్, సౌకర్యం కల్పించాలని కోరారు,హమాలీల పై ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపించడం సరి కాదని అన్నారు. గత 40 సవంత్సరాల నుండి చాలి చాలని వేతనాలు తీసుకుంటూ నిత్యావసర సరుకుల ప్రజలకు పంపిణీ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా కేసీఆర్ ముఖ్యమంత్రికి హమాలీల పై ప్రేమ ఉంటె ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున ముఖ్యమంత్రి హమాలీల రేట్లు పెంచాలని,అలాగే హమాలీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు.సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, బోనస్ 10 వేలు చెలించాలని, ప్రమాద నష్ట పరిహారం 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసారు.. ప్రపంచ కార్మిక దినోత్సవం132 వ మే డే ను జిల్లాలోని అన్ని వర్గాల కార్మికులు పాలుగోని విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేఖరుల  సమావేశంలో హమాలీల సంఘం కార్యదర్శి బి. సుధాకర్, నాయకులు  కేశవ్, మోహన్, దివాకర్, తుకారం, బావుజి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment