కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 2 ; గొర్రెల యూనిట్ ల పంపిణీలో రాష్ట్రంలో కొమురంభీం జిల్లా మూడో స్థానంలో ఉందని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవం పాటిల్ అన్నారు. సోమవారం పశుసంవర్ధక శాఖ వారు అందిస్తున్న గొర్రెలకు వేసవి లో పచ్చి మేత కోసం 75 శాతం సబ్సిడీపై జిలాలోని 2215 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి 5 కిలోల జొన్న గడ్డి విత్తనాల పంపిణిని జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలోప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ గొర్రెల పెంపకందారులు ఈ విత్తనాలను నాటుకొని తమ గొర్రెలకు మేతగా ఉపాయపగించుకోవాలన్నారు. 250 రూపాయలు విలువచేసే ఈ 5 కిలోల విత్తనాల సంచి 75 శతం సబ్సిడీ పోను కేవలం 42 రూపాయలకే లభిస్తుందన్నారు . ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త పాలనాధికారి అశోక్ కుమార్, డి ఆర్ ఓ కంద సురేష్ , డి ఆర్ డి ఏ పి డి వెంకట్, ఐలా పశుసంవర్ధక అధికారి డాక్టర్ కుమార స్వామి మరియులబ్దిదారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment