Monday, 23 April 2018

కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరు పై కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రటరీ సమీక్ష

   
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 23 ;  కేంద్రప్రభుత్వ పథకాల అమలు తీరును కేంద్రప్రభుత్వ అర్బన్ అఫైర్స్  డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీ జానకి సోమవారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామంలోజరిగిన గ్రామ సభలో   సమీక్షించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ  పథకాలద్వారా మారుమూల గ్రామాలలోని ప్రజలకు   లబ్ది అందేలా చూడాలని  అన్నారు.ఏప్రిల్ 15  నుంచి మే 5 వరకు కేంద్ర  ప్రభుత్వ పథకాలు అమలు మరియు వాటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారుభారత దేశంలో ప్రతి ఒక్కరు  ప్రధానమంత్రి    జీవన్ జ్యోతి బీమా యోజన  పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.  ఇప్పటి వరకు ప్రజల్లో ఈ పథకానికి సంబంధించి అవగాహన ఉన్న కూడా ఈ పథకానికి దూరంగా ఉంటున్నారన్నారు.  సంబంధిత  శాఖ  వారు ఈ విషయంపై  దృష్టి సారించి ప్రతి ఒక్కరికి భీమా యోజన పథకం వర్తింపజేయాలన్నారు. భీమా ప్రీమియం తక్కువ మరియు  భీమా  ఎక్కువ అని అన్నారు. ప్రతిఒక్కరు భీమా  చేసుకొనేటట్లు కృషి చేయాలన్నారు. అలాగే  ప్రధాన మంత్రి సౌభాగ్య యోజన పథకం ద్వారా పల్లె, పట్టణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి విద్యుత్తును అందించడంలో  భాగంగా  సౌభాగ్య యోజన అనే పథకాన్ని  ఆవి ష్కరించారు.అన్నారు. ఇప్పటి కీ విద్యుత్ అందని ఇంటికి  సౌభాగ్య పథకం  కింద ప్రతి  ఇంటికి విద్యుత్తు అందించాలని  అన్నారుఎటువంటి ఖర్చు లేకుండా కరెంటు మీటర్ పొందవచ్చని అన్నారు. ఇంకొక పథకమైన మిషన్ ఇంద్రధనష్  పేద మహిళలు ఈ సేవలను వినియోగించుకోవాలని,  శిశుమరణాలను తగ్గించడానికి మిషన్ ఇంద్రధనష్ ద్వారా వ్యాక్సినేషన్లను తప్పనిసరిగా వేసుకోవాలన్నారు.  మిషన్ ఇంద్రధనస్సు లో వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలు గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు.ప్రధాన మంత్రి ఉజ్వాల యోజన ఈ పథకం ద్వార దారిద్ర రేఖకు దిగువగ ఉన్న ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ కనెక్షన్లను  కేంద్ర ప్రభుత్యం అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా  గ్రామంలోని లబ్దిదారులకు గ్యాస్ కనెక్షన్ లను అందచేశారు.  ఈ పథకాన్ని గ్యాస్ లేని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ప్రధాన మంత్రి జన ధన్ యోజన ఈ  స్కీంలో భాగంగా  ఖాతాతెరచిన ప్రతి వ్యక్తి కుటుంబం మొత్తo తమ జీవిత కాలమంతా  లక్ష రూపాయల ప్రమాద భీమాకు అర్హత లభిస్తుంది అన్నారు. జీవిత భీమా సదుపాయాన్ని బ్యాంకు ఖాతా ద్వారా రెన్యూవల్ చేసుకొని ప్రమాద భీమా పొందవచ్చని సూచించారు. డిజిటల్ ఇండియా పథకంలో భాగంగా భౌతికంగా డబ్బు మార్పులేని ఆర్ధిక వ్యవస్థకు పునాది వేయడమే  జన్ ధన్ యోజన యొక్క దీర్ఘకాలిక ప్రణాళిక అని అన్నారు.అనంతరం కొమురంభీం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ప్రతి ఒక్క శాఖ   వారు కూడా విధిగా లబ్ధిదారులకు అందే విదంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ కారక్రమంలో మంచిర్యాల్ జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, డిఆర్డిఓ వెంకట్,డిపిఓ గంగాధర్,డి ఎం హెచ్ ఓ సుబ్బారాయుడు,డిప్యూటీ డిఎమ్హెచ్ఓ  సీతారాం,పిడి సావిత్రి, రెబ్బెన ఎమ్మెర్వో సాయన్న ,ఎంపిడివో సత్యనారాయణ సింగ్,ఎంఈవో వెంకటేశ్వర స్వామి తదితర మండలాధికారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment