Tuesday, 17 April 2018

ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో ర్యాలీ ; బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 17 ;  ఆసిఫా ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిముషాలు మౌనం పాటించి బెటర్ యూత్ బెటర్ సొసైటీ సేవా సంస్థ సేవా సంస్థ ఆద్వర్యంలో  మంగళవారం రేబ్బెన మండలం లో గోలేటి బస్టాండ్ నుండి అంబేద్కర్ వద్దకు ర్యాలీ నిర్వహించారు.  అనంతరం సేవా సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ మాట్లాడుతూ ఆసిఫా ను హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు రాజశేఖర్, రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి, అజయ్, సహాయ కార్యదర్శి, జనగామ విజయ్, సభ్యులు తిరుపతి, సంజయ్, సతీష్,సాయి,రాజ్,కుమార్, విజయ్, శ్రీరామ్, కుమార్, విజయ్, శేఖర్, శ్రీకాంత్, పవన్, అంజి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment