కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 20 ; రెబ్బెన మండల పులికుంట గ్రామంలో గుడుంబా స్వాధీన పరుచుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సి. ఐ రాంబాబు తెలిపారు. గుడుంబా అమ్ముతున్నారనే ఖచ్చితమైన నిఘా సమాచారం తో టాస్క్ ఫోర్స్ సి. ఐ రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ లు తనిఖీ చేయగా ఎరుగటి లస్మయ్య ఇంట్లో అమ్మటానికి సిద్దంగా ఉంచిన 5 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని రెబ్బన . పోలీస్ వారికి తదుపరి విచారణ నిమిత్తం అప్పగించడం జరిగిందన్నరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా నిర్భయంగా తెలియ పరచవచ్చనీ, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది అని అన్నారు.
No comments:
Post a Comment