Saturday, 14 April 2018

క్షణికావేశంలో యువకుడి ఆత్మహత్య


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  14 ;  రెబ్బెన మండలం దుగ్గపూర్ గ్రామానికి చెందిన దుర్గం వెంకటేష్ (23) పురుగులమందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని రెబ్బెన ఎస్సై శివకుమార్ శనివారం తెలిపారు. ఆత్మహత్యకుపాల్పడ్డ వెంకటేష్ తాగుడుకు బానిసై  ఏ పని చేయకపోవడంతో  తల్లి దండ్రులు మందలించడంతో శుక్రవారం పురుగులమందు త్రాగినట్లు 
 గమనించిన కుటుంబసభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడని తండ్రి లింగయ్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

No comments:

Post a Comment