Tuesday, 10 April 2018

బొగ్గు గనుల ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్10 ;   భారత దేశ వ్యాప్తంగా బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏప్రిల్ 16న  జరుగు ఒక్కరోజు టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలనీ ఎఐటియుసి గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్ తిరుపతి  కార్మికులను కోరారు. మంగళవారం గోలేటి సిపిఐ కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడారు.  కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల16 వ తేదీన తమ డిమాండ్ల సాధనకై ఒక రోజు సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో బొగ్గుగని కార్మికుల భవిష్యత్తు, కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుందని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిందని  వారి ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని పదహారున జరగబోయే సమ్మె ప్రభుత్వానికి ఒక గుణ పాఠం కావాలని హెచ్చరించారు. గుర్తింపు సంఘమైన టి జి బి కే ఎస్  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపర్చే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు ఎలాంటి ఆంక్షలు లేకుండా కారుణ్య నియామకాలు అమలు చేయాల్సిన బాధ్యత వారిపైనే ఉందని అన్నారు ఈ క్రింది డిమాండ్ల సాధనకు ఒక్కరోజు సమ్మెను చేపట్టబోతున్నామని తెలియజేశారు. పదో వేజ్ బోర్డ్ ఎరియర్స్ వెంటనే చెల్లించాలని, ముఖ్యమంత్రి వాగ్దానం ప్రకారం కారుణ్య  నియామకాలను కల్పించాలని, వడ్డీలేని పది లక్షల ఇంటి నిర్మాణ రుణం కంపెనీ చెల్లించాలని, గ్రాడ్యుటీ ఇరవై లక్షల సీలింగ్ తీసివేసి 01.01.2014  నుండి అమలుపరచాలని . డిమాండ్ల సాధనకై  ఈ నెల పదహారవ తేదీన జరుగు సమ్మెను కార్మికులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కిరణ్ బాబు, జూపాక రాజేష్, దివాకర్,  భిక్షమయ్య, పోచమల్లు ,ఎమ్మార్ చారి,  పివి రెడ్డి,  మారం శ్రీను,  హైమద్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment