Wednesday, 11 April 2018

సి పి ఎం జాతీయ మహాసభల సన్నాహక సమావేశం


 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్  11;  సి పి  ఎం  జాతీయ మహాసభల సన్నాహక సమావేశం కొమురంభీం జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి గార్డెన్స్లో బుధవారం నిర్వహించారు.ముఖ్య అతిధిగా పాల్గొన్న సి పి  ఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం జ్యోతిబా పూలే  192 వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం  మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాయకులు  జాతీయ సభలకి పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటిని తుంగలోతొక్కిందని అన్నారు. దేశం బయట ఉన్న నల్లధనాన్ని వెలికి తీసే దేశప్రజలందరికి సుమారు 15 లక్షలు వారి అకౌంట్ లలో  జమ చేస్తామని  చెప్పారన్నారు. ఇంతవరకు ఆ దిశగా ఒక్క అడుగు వేయలేదన్నారు. దేశంలో కులాల, మతాల మధ్య చిచ్చు రగిలిస్తున్నారన్నారు. తమ పార్టీ  భవిష్యత్తు కార్యాచరణను జాతీయ మహాసభలలో నిర్ణయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి, జిల్లా కార్యదర్శి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment