కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 15 ; రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషన్ లో ఆదివారం తెల్లవారు జామున గుర్తుతెలియని రైలు నుండి పడి గుర్తుతెలియని ( 25 నుంచి 30 సంవత్సరాల) వ్యక్తి మృతి చెందినట్లు కాగజ్ నగర్ జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ విజయ్కుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాలు ప్రకారం కాజీపేట్ నుండి కార్నర్ వైపు వెళ్లే రైలు నుంచి కిందపడి మృతి చెంది ఉండవచ్చునని అభిప్రాయపడ్డారు. మృతుడు కుడి చేతిపై చిన్న ప్రేమకావాలి రాజేశ్వరి అని పచ్చబొట్టు ఉందని తెలిపారు. మృతుడి కుడిచేయి పూర్తిగా శరీరంనుంచి విడివడిందన్నారు. మృతుడు నస్యం రంగు చొక్కా, గోధుమరంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, కాళ్ళకు నల్లని శాండీల్స్ ఉన్నాయని తెలిపారు. మృతుడు ఆచూకి గుర్తుపట్టి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే కాగజ్ నగర్ జీఆర్పీ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
No comments:
Post a Comment