Saturday, 14 April 2018

అక్రమ మద్యం మరియు గుట్కా ల స్వాధీనం

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) ఏప్రిల్  14 ;  అక్రమంగా విక్రయిస్తున్న మద్యం గుట్కాలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్  ఫోర్స్ సిఐ రాంబాబు తెలిపారు.  రెబ్బెన  మండలం కొండపల్లి గ్రామ బస్సు స్టాండ్ వద్దగల   కిరాణం షాపులో అక్రమంగా  విక్రయిస్తున్న మద్యం  గుట్కాలను టాస్క్ ఫోర్స్ సి ఐ    ఆధ్వర్యంలో  రెబ్బెన  ఎస్సై   శివకుమార్  దాడి చేసి మద్యం మరియు గుట్కాలను స్వాధీనం చేసుకున్నారు.  ఈ దాడిలో    12,880 రూపాయల విలువగల మద్యం,1,355 రూపాయల విలువగల   గుట్కాలు స్వాధీనం చేసుకోవడం  జరిగిందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నామన్నారు

No comments:

Post a Comment