.
కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి) ఏప్రిల్ 9 ; ప్రజా ఫిర్యాదులను త్వరితంగా పరిష్కరించాలని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. జిల్లా పాలనాధికారి సమావేశం మందిరంలో ఫిర్యాదులలో భాగంగా సోమవారం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వారంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు రాంటెంకి మల్లేష్ గ్రామం కొత్తిమీర దహెగాం మండల నివాసి, ఇంద్ర జలప్రభ ద్వారా బోర్లకు విద్యుత్ సరఫరా చేయాలనీ మంగ అందవెల్లి కాగజ్ నగర్ నివాసి అకాల వర్షం వలన ఇల్లు కూలిపోయిందని నష్టపరిహారం ఇప్పించాలని, శ్రీదేవి సర్కపల్లి గ్రామం వాంకిడి మండలం నివాసి అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తగా నియమించాలని, సిర్పూర్ టి మండలం నివాసి స్వప్న ఆపద్బాందు పథకం కింద పింఛన్ ఇవ్వాలని, రాజేశ్వరి వికలాంగురాలు లోనవెల్లి గ్రామం కగజనగర్ తనకు ట్రై సైకిల్ ఇప్పించాలని, దుర్గం లీలా పెంచికల్ పేట గ్రామం కగజనగర్ మండలం నివాసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కొరకు, కాంట్రాక్టర్ లెక్చరర్లకు నాలుగు నెలల నుండి జీతం రాలేదని, వాంకిడి జీపీలోని అంకినీలో విద్యుత్ వైర్లు ఇళ్లపై నుండి ఉన్నాయని వాటిని మార్చాలని, తదితర దరఖాస్తులను జిల్లా పాలనాధికారి అర్జీదారుల నుండి దాదాపుగా తొంభై ఆరు దరఖాస్తులు వచ్చాయని, తెలంగాణ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ మరియు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ ద్వారా ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలు పాటిద్దామని పోస్టర్లను జిల్లా పాలనాధికారి అవిష్కరించారు ఎండ తీవ్రతకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు తరచూ నీళ్లు తాగుతూ బయటకు వెళ్లేటప్పుడు వెంట మంచినీళ్ల ఉండేలా చూడాలన్నారు ఎక్కువ నిమ్మరసం కొబ్బరి నీళ్లు తాగాలని ఎండలో వెళ్ళేటప్పుడు తలకు టోపీ పెట్టుకుని వడదెబ్బ తగిలిన వారు జాగ్రత్తలు పాటించాలని ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి కొన్ని జాగ్రత్తలు వడదెబ్బ తగలకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు ఈ ప్రజా ఫిర్యాదుల విభాగంలో జిల్లా సంయుక్త పాలన అధికారి వి అశోక్ కుమార్ ఆర్డీవో కదం సురేష్ జిల్ సుర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment