తక్కువ వేతనాలు చెల్లిస్తున్న ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టాలి: ఏఐటీయూసీ
ఆసిఫాబాద్, నవంబర్ 2
మిషన్ భగీరథ కార్మికులకు ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం వేతనాలు చెల్లించకుండా శ్రమదోపిడీకి పాల్పడుతున్న ఎల్‌అండ్‌టీ, ఎవరెస్టు, రాఘవ తదితర ఏజెన్సీలను బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ హరిత, ఎమ్మెల్యే కోవ లక్ష్మికి వినతిపత్రాలు అందజేశారు. గత పదేళ్లుగా కార్మికులకు తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, ఎస్‌ఎస్‌ఆర్ ప్రకారం కనీసం రూ.26 వేల వేతనం ఇవ్వాలని పలుమార్లు కోరినా అధికారులు, ఏజెన్సీలు పట్టించుకోవడం లేదని ఉపేందర్ ఆరోపించారు. నెల జీతాన్ని బోనస్‌గా చెల్లించాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనం, జీతం చీటీలు ఇవ్వాలని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, యూఏఎన్ సౌకర్యాలతో పాటు పెట్రోల్ అలవెన్స్, రూ.50 లక్షల ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 5వ తేదీలోగా సమస్యలు పరిష్కరించకపోతే 6వ తేదీన మిషన్ భగీరథ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆత్మకూరి చిరంజీవి, బ్రాంచ్ అధ్యక్షుడు పి. జయకృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ షబాజ్, కార్యదర్శి రాజేశ్వర్, నాయకులు వేణు, శ్రీకాంత్ పాల్గొన్నారు.

No comments:
Post a Comment