టాస్క్ ఫోర్స్ మెరుపు దాడులలో దుప్పి కొమ్ములు, నకిలీ పత్తి విత్తనాలు, అక్రమ టేకు నిల్వ, మద్యం మరియు గుట్కా నిల్వ పట్టివేత
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం) ఏప్రిల్ 14 ; ఆసిఫాబాద్ టౌన్ మరియు రెబ్బన పోలిస్ స్టేషన్ల పరిథి లో దుప్పి కొమ్ములు, నకిలీ పత్తి విత్తనాలు, అక్రమ టేకు నిల్వ, మద్యం మరియు గుట్కా నిల్వలు ఉన్నాయి అని ఖచ్చితమైన నిఘా సమాచారం తో టాస్క్ ఫోర్స్ సి. ఐ రాంబాబు నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులు ప్రసాద్, వెంకటేష్ గార్లు తనిఖీ చేయగా ఆసిఫాబాద్ టౌన్ లో మూడు చోట్ల పొడుపుగంటి నవీన్, తక్సడే లక్ష్మి మరియు సిరుప గోపాల్ కిరాణం షాపులలో తనిఖీ చేయగా 20,175/- విలువ గల మద్యం మరియు 10,495/- విలువ గల గుట్కా నిల్వను స్వాధీనం చేసుకొని తదుపరి విచారణ నిమిత్తం ఆసిఫాబాద్ పోలీస్ వారికి అప్పగించటం జరిగింది. రెబ్బన పోలీస్ స్టేషన్ పరిధిలో కొండపల్లి స్టేజ్ వద్ద సప్తే నరేష్ కిరణ షాపులో 12,880/- మద్యం మరియు 1,355/- విలువ గల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకోవడం జరిగినది. సింగిల్ గూడ గ్రామంలో అజ్మీరా బోరెలాల్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన దుప్పి కొమ్ములు మరియు 22,000/- విలువ గల 12.25 కిలోల నకిలీ పత్తి విత్తనాలు మరియు 10 ఫీట్ల అక్రమ టేకు నిల్వ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
No comments:
Post a Comment