Friday, 6 April 2018

ప్రభుత్వ నిబధనలు పాటించని కళాశాలలపై చర్యలు తీసుకోవాలి


కొమురం భీం ఆసిఫాబాద్ (వుదయం ప్రతినిధి)  ఏప్రిల్ 6 ;   ప్రభుత్వ నిబధనలు పాటించని ఇందిరా, వసుంధర డిగ్రీ కళాశాలల పై చర్యలు తీసుకోవాలని కుమురం భీం  జిల్లా ఎస్ ఎఫ్ ఐ  అధ్యక్షులు కుబిడే రాకేష్  అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 5 వ తేదీన భారత మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగ్జివన్ రామ్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించినప్పటికీ ప్రభుత్వ నిబధనలను ఏ మాత్రం పట్టించుకోకుండ, ప్రభుత్వ నిబధనలను తుంగలో తొక్కి కాగజ్ నగర్ పట్టణంలోని ఇందిరా మరియు వసుంధరా డిగ్రీ కళాశాలలు తరగతులు నిర్వహించారని . సెలవు రోజుల్లో ఎలా తరగతులు నిర్వహిస్తారని ప్రశ్నించిన ఎస్ ఎఫ్ ఐ  నాయకులపై దురుసుగా ప్రవర్తించిన కళాశాల ప్రన్సిపాల్ పైన తగు చర్యలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వ నిబధనలు పాటించని కళాశాలల గుర్తింపు రద్దు చేయాలని అన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు  పిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి  చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు పృధ్వీరాజ్, ఆనంద్  మరియు నాయకులు వికాస్, గోపాల్ తదితరులు  పాల్గొన్నారు.

No comments:

Post a Comment