కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; వట్టివాగు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ నీటిని ఆసిఫాబాద్ మండలంలో ఈ నెల 8 న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బద్రినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు రబీ సాగుకు సిద్ధంగా ఉండి ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. ప్రధాన కాల్వలు పిల్ల కాల్వల పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో నీటివృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. డి5 డిస్ట్రిబ్యూటరీ చివరి ఆయకట్టు దారులు అప్రమత్తంగా ఉండి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.కిందిస్థాయి ఇరిగేషన్ శాఖ అధికారులు పంట కాలంలో జాయింట్ అజమాయిషీ చేసే సమయంలో సహకరించాలని కోరారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 4 January 2018
వట్టివాగు నీరు 8న విడుదల
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (వుదయం ప్రతినిధి) జనవరి 4 ; వట్టివాగు ప్రాజెక్టు కుడి ఎడమ కాలువ నీటిని ఆసిఫాబాద్ మండలంలో ఈ నెల 8 న సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బద్రినారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు రబీ సాగుకు సిద్ధంగా ఉండి ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలన్నారు. ప్రధాన కాల్వలు పిల్ల కాల్వల పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో నీటివృథా చేయకుండా సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. డి5 డిస్ట్రిబ్యూటరీ చివరి ఆయకట్టు దారులు అప్రమత్తంగా ఉండి నీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.కిందిస్థాయి ఇరిగేషన్ శాఖ అధికారులు పంట కాలంలో జాయింట్ అజమాయిషీ చేసే సమయంలో సహకరించాలని కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment