కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 04 ; ప్రజలు బ్యాంకులు అందిస్తున్న నగదు రహిత లావాదేవీలపై అవగాహన పెంచుకొని సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎల్ ఎఫ్ సీ అంజన్న అన్నారు. శనివారం రెబ్బెన మండల పులికుంట గ్రామంలో ప్రజలకు నగదు రహిత బ్యాంకు లావాదేవీలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వివరించారు. బ్యాంకులలో మైక్రో ఏ టి ఎం లను ఉపయోగించుకోవాలని సూచించారు. రూపే , కిసాన్ కార్డు ల పై ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన వ్యవసాయ పరపతి సంఘం సి ఈ ఓ సంతోష్ , రైతులు , గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment