Sunday, 5 August 2018

గ్రామా పంచాయతీ కార్మికుల సమస్యలను సత్వరం పరిష్కరించాలి


కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 05  గ్రామ పంచాయతీ కార్మికుల  సమస్యలను సత్వరం పరిష్కరించి అర్హులైన వారిని   కార్యదర్సులు గా   నియమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బోగే ఉపేందర్ అన్నారు.  రెబ్బెన మండల కేంద్రంలో  తహశీల్ధార్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె అదివారం 14వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు.  14 వ రోజు దీక్షలో జి పి  డబ్ల్యూ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్, కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్, కార్మికులు  సునీల్, దేవాజి, వీరయ్య, నారాయణ,లక్ష్మి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment