కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 24 ; రెబ్బెన మండలం రాళ్లపేట సమీపంలో శుక్రవారం ఆటో డ్రైవర్ అజాగ్రత్త, అతివేగం మూలంగా ఆటోఏ పి 01 వై 2172 బోల్తా పడి ఆరుగురికి గాయాలైనట్లు ఎస్సైదీకొండ రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కాగజ్ నగర్ నుండి రెబ్బెన కు వస్తున్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తా పడగా అందులో ప్రయాణిస్తున్న వి రాజలింగు, సంతోష్, సత్యనారాయణ, కళావతి, మౌనిక, పోశెట్టి లు తీవ్రంగా గాయపడడం జరిగిందన్నారు. భాదితులను రెబ్బెన సర్కిల్ ఇన్స్ఫక్టర్ రమణ మూర్తి తన వాహనంలో ఆసిఫాబాద్ ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. గాయపడిన రాజా లింగు ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ రెడ్డి శ్రీనివాస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా గాయపడినవారందరు మండలంలోని నవేగం గ్రామానికి చెందినవారు.
No comments:
Post a Comment