Friday, 24 August 2018

గ్రామ నవ నిర్మాణ సమితి ఆద్వర్యం లో హరితహారం

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 24 ;   రెబ్బెన మండలం  నంబల గ్రామంలోని  శివాలయం ఆవరణ లో  గ్రామ నవ నిర్మాణ సమితి ఆద్వర్యం లో  శుక్రవారం సుమారు 50 మొక్కలను నాటి  హరితహారం కార్యక్రమని నిర్వహించారు. ఈ సందర్భంగా . సమితి అధ్యక్షులు ఇంగు జగదీష్,   ప్రధాన కార్యదర్శి  కుమ్మరి పెంటయ్య లు  మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డ్లు పెడతామని, మొక్కలు ఎండి  పోకుండా చూస్తామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గ్రామంలోని యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి హరితహారం కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో  సంతోషదాయకమని ఫారెస్ట్  బీట్   ఆఫీసర్ లు  రవి,  మహేశ్ అన్నారు. ఈ కార్యక్రమం లో గ్రామ నవ నిర్మాణ సమితి ఉప అద్యక్షుడు ముధాం వెంకటేష్,  ఉమ్మడి కార్యదర్శి అడే  సోమశేఖర్, కోశాధికారి ఎర్ర సమయ్య,   సమితి సభ్యులు  గ్రామ యువత పాల్గొన్నారు.

No comments:

Post a Comment