కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 13 ; లక్ష ఉద్యోగాలు నిరుద్యోగులకు భర్తీ చేస్తానని తెలంగాణా ప్రభుత్వం మోసం చేసిందని వెంటనే లక్ష ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ జారీ చేయాలని వై ఎస్ ఆర్ సీ పి కొమురం భీం జిల్లా అధ్యక్షులు జమలాపూర్ సుధాకర్ . సోమవారం రెబ్బెన మండల కేంద్రంలో లక్ష ఉద్యోగాల భర్తీకి వై ఎస్ ఆర్ సీ పి తరపున సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా లక్ష ఏడువేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన మాటలు నీటి మూటలుగానే మిగిలాయని, ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయినప్పటికీ 12000 ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేశారన్నారు. అర్హులైన నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలన్నారు.
No comments:
Post a Comment