Tuesday, 7 August 2018

యువత సమాజ సేవ లో ముందుండాలి

    కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 07 ; యువత సమాజ సేవ లో ముందుండాలని ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి అన్నారు. మంగళవారం  రెబ్బెన మండల జిల్లా  పరిషత్ పాఠశాలలో జరిగిన  బెటర్ యూత్ బెటర్ సొసైటీ 4 వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఎంఎల్ ఏ  కోవ లక్ష్మి హాజరై కేక్ కట్ చేసి మాట్లాడారు.  యువకులు సమాజ సేవకై సొసైటీ  స్థాపించి గత నాలుగేళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. స్వచ్చంద సంస్థ  వారు విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులందరూ ఈ రకమైన సేవా  దృక్పధాన్ని అలవర్చుకోవాలన్నారు.  తెలంగాణా ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నో పథకాలు ప్రెవేశపెట్టి ప్రోత్సహిస్తున్నదన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి, విద్యారులతో కలసి  భోజనం చేశారు. ఎం ఎల్ ఏ  కోవలక్ష్మి కి స్వచ్చంద సంస్థవారు శాలువాతోఘనంగా  సన్మానించారు. సంస్థ సభ్యులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో  సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్, ఉపాధ్యక్షులు  నామాల రాజశేఖర్, ఓరగంటి రవీందర్, ప్రధాన కార్యదర్శి జనగామ అజయ్, సహాయ కార్యదర్శి విజయ్, సత్యనారాయణ, తిరుపతి, వంశీ, అజయ్, తిరుపతి, తరుణ్, అఖిల్ అకార్తీక్ ,  ఎస్ సీ  ఎస్ టి టీచర్స్  యూనియన్ కుంరంభీం జిల్లా అధ్యక్షులు  మేడి చరణ్ దాస్ కార్యవర్గ సభ్యులు  పాఠశాల ఉపాధ్యాయులు . అనీస్. జామున దాస్. మౌళి . చంద్రశేఖర్ .బానేశ్. ప్రభాకర్ .వశీమ్..గోపాల్.  మరియు . శ్రీదేవి  .శ్రీలత . పుష్పలత   పాఠశాల సిబ్బంది విద్యార్థిని విధార్తులు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment