కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 11 ; రెబ్బెన మండల కేంద్రంలోని రెబ్బెన పంచాయతీ కార్యాలయంలో శనివారం కేంద్రపథకాలపై నేషనల్ లెవెల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మోహన్ రావు, సునిల్ లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రం దేశంలోని పేద ప్రజలకు ప్రెవేశ పట్టిన వివిధ పధకాల ను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కేంద్రపదకాలైన ప్రధాన మంత్రి ఉజ్వలయోజన, ప్రధానమంత్రి సహజ బిజిలి హర్ ఘర్ యోజన, ప్రధానమంత్రి ఉజాలా పధకం, ప్రధాన మంత్రి జాన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి జీవం జ్యోతి భీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన మంత్రి మిషన్ ఇంద్రధనుష్ మొదలైన పథకాల గురించి విపులంగా వివరించి, పధకాలు అమలు తీరును అధికారులను అడిగి తెలుసు కున్నారు. పేద ప్రజలకు జన్ధన్ భీమా యోజన తో చాలా తక్కువ ప్రీమియం తో జీవిత భీమా చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మహేష్, పంచాయతీ సెక్రటరీ మురళీధర్, సబ్ ఇంజనీర్ శ్రీనివాస్,బ్యాంకు అకౌంటెంట్ రవి, రెబ్బెన మండల హెచ్ పి గ్యాస్ డీలర్ ప్రకాష్ అగర్వాల్, మాజీ సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఐ కే పి సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment