Thursday, 30 August 2018

.టి ఆర్ ఎస్ వి అద్వ్యర్యంలోకెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 30 ; రాష్ట్రంలో 7 కొత్తజోన్లను సాధించినందుకు కెసిఆర్ చిత్రపటానికి టి ఆర్ ఎస్ వి  జిల్లా అధ్యక్షులు మస్క రమేష్ అద్వ్యర్యంలో గురువారం రెబ్బెన  అతిధి గృహంలో 
 పాలాభిషేకం నిర్వహించారు.  తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో7  కొత్త జోన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసి  గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ఏడు జోన్లకు, రెండు మల్టీ జోన్లకు గురువారం గౌరవ రాష్ట్రపతి  ఆమోద ముద్రవేశారని  ఇది తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు  శుభవార్త అని అన్నారు.  ఎందుకంటే ఈ నిర్ణయంతో  స్థానికులకే 95% ఉద్యోగాలు దక్కనున్నాయి. ఇందులో గౌరవ సీఎం కేసీఆర్ గారి పాత్ర అత్యంత కీలకం అని అన్నారు .  ఈ కార్యక్రమంలో ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, తెరాస నాయకులూ చెన్న  సోమశేఖర్, బొమ్మినేని శ్రీధర్, సంగం శ్రీనివాస్, మోడెమ్ సుదర్శన్ గౌడ్, బొమ్మినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment