Friday, 24 August 2018

వాలీ బాల్ కిట్ ల పంపిణి

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 24 ; రెబ్బెన మండలం  లోని పుంజు మేర  గూడ గ్రామ యువకులకు శుక్రవారం తెరాస నాయకుడు ఆత్మారాం నాయక్ వాలీ బాల్ కిట్లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించాలనే  ఉద్దేశంతో క్రీడా సామాగ్రిని అందచేయడం జరుగుతుందన్నారు.  క్రీడా సాధన ద్వారా యువకులు ఆరోగ్యకరం గా ఉండడంతో పాటు చేడు  వ్యసనాల బారిన పడకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు భిక్షపతి ,   వెంకటేష్,  సురేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment