కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 14 ; రెబ్బెన మండలం గోలేటి క్రాస్ వద్ద గల సీ హెచ్ పి వద్ద మంగళ వారం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మెగా హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి , జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్ లు పాల్గొన్నారు. సింగరేణి పాఠశాల విద్యార్థిని , విద్యార్థులతో కలసి మొక్కలు నాటిన తర్వాత మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా హరిత హారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపడుతున్నామని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటిన తర్వాత వాటిని సంరక్షించి వృక్షాలుగా ఎదిగేటట్లు సంరక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాదికారిలక్ష్మణ్ రామ్ నాయక్ , బెల్లంపల్లి సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ రవిశంకర్, సింగరేణి సేవ సంస్థ అధ్యక్షురాలు అనురాధ రవిశంకర్, డి వై పి ఎం కిరణ్, ప్రాజెక్ట్ ఓఫిర్ లు కొండయ్య, శ్రీనివాస్, మోహన్ రెడ్డి , డి వై పి ఎం లు రామ శాస్త్రి, రాజేశ్వర్,టీజీబీకేష్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్ రావు, రెబ్బెన ఎంపీటీసీ అజమీర బాబు రావు, ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్, ఎంపీటీసీ లు కోవూరి శ్రీనివాస్, వనజ, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షురాలు కుందారపు శంకరమ్మ, తెరాస రెబ్బెన మండల మహిళా అధ్యక్షురాలు మన్యం పద్మ టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, ,సింగరేణి అధికారులు, విద్యారిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు .
No comments:
Post a Comment