Thursday, 23 August 2018

కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన ప్రేత్యేక అధికారి


కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 23 ;  కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కంటివెలుగు కార్యక్రమం ప్రేత్యేక అధికారి  సీతారాం , జిల్లా   డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ  సుధాకర్ నాయక్  లు అన్నారు.  గురువారం రెబ్బెన మండల కేంద్రంలోని  ప్రభుత్వ ప్ర్రార్ధమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటుచేసిన కంటివెలుగు కేంద్రాన్ని  సందర్శించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ఎంతో  ప్రతిష్టాత్మకంగా ప్రెవేశ పెట్టిన కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు చేసి ఉచితంగా కంటి  అద్దాలు అందిస్తారన్నారు .  కంటివెలుగు శిబిరం రికార్డులను పరిశీలించారు. అనంతరం   సంబంధిత అధికారులతో మాట్లాడుతూ  కంటి వెలుగు శిబిరానికి వచ్చేవారి వివరాలను సరిగా నమోదు చేయాలని, మండలంలోని  అందరు కంటి పరీక్షా చేసుకునే  ఏర్పాట్లు చేయాలన్నారు.  శిబిరానికి వచ్చేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మాధురి , హెచ్ వి రూత్ క్లారా , కమల్, ప్రవీణ్, మొయిజ్, ఫార్మసిస్ట్ , ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment