Sunday, 19 August 2018

ప్రభుత్వాలు కార్మికులకు చేస్తున్న ద్రోహాలఫై హైదేరాబద్ లో 9న భారీ బహిరంగ సభ ; ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు

  కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 19 ; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు చేస్తున్న ద్రోహాలను వివరిస్తామన్నారు. సెప్టెంబర్ 9 న హైదేరాబద్ లో జరిగే  భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని  ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు అన్నారు. ఏఐటీయూసీ చేపట్టిన ప్రచార యాత్ర  అదివారం గోలేటి క్రాస్ రోడ్ చేరుకున్న సందర్భంగా కూడలి  వద్ద  జండా ఎగురవేశారు. అనంతరం రెబ్బెన గ్రామానికి చేరుకున్న యాత్ర ప్రధాన కూడలి వద్ద   ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు మాట్లాడారు. అలాగే మండల తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా  దీక్షలో ఉన్న గ్రామ పంచాయతీ ఉద్యోగుల శిబిరాన్ని సందర్శించి వారికీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులూ మాట్లడుతూ గత 28 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల పై సమ్మె చేస్తున్న వారికీ ప్రభుత్వం స్పందించాలని అన్నారు.కార్మికుల సమస్యలపై నిరంతరంఏఐటీయూసీ పోరాడుతుందన్నారు. ఈ నెల  9 న యాత్రను చేపట్టామని, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వెళ్లి ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు చేస్తున్న ద్రోహాలను వివరిస్తామన్నారు. సెప్టెంబర్ 9 న హైదేరాబద్ లో జరిగే  భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని అన్నారు. కార్మిక సోదరులు ఈ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉజ్జిని రత్నాకర్ రావు,ఉప ప్రధాన కార్యదర్శి S. బలరాజ్,రాష్ట్ర కార్యదర్శి యూసుఫ్, విలాస్, కరుణకుమారి,ఉపాధ్యక్షులు సీతారామయ్య,జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, మండల కార్యదర్శి  రాయిల్లా నర్సయ్య,జిల్లా కార్యదర్శి నగవేల్లి సుధాకర్, ఏఐటీయూసీ GP వర్కర్స్ యూనియన్ మండల ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,కార్యదర్శి వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ శంకర్,లాలూ సింగ్, AISf డివిసిన్ ప్రెసిడెంట్ పుదారి సాయి కిరణ్,  వైస్  ప్రెసిడెంట్ పరవతి సాయి ,జగ్గయ్య, కిరణ్, రాజేష్ లతో పాటు తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment