కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 08; పండింగ్ లో ఉన్న పీజ్ రియంబర్స్ మెంట్ , స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేసి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జిల్లా హాస్టల్ కో కన్వినర్ జామిడి అరుణ్ బుధవారం రెబ్బెన తహసీల్దార్ సాయన్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఏబివిపి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలో భాగంగా ఈ రోజు తహశీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. కొమ్రంభీం అసిపాబాద్ జిల్లాలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తే అరెస్టులు చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలపై నిరసన ప్రకటిస్తే అరెస్టులు చేస్తే ఉద్యమాలు ఆగవని విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని కోరారు. ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని, రాష్ట్రంలో లక్షా ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని అన్నారు. ఎంసెట్ స్కాంలో విచారణ జరిపి అసలు దోషుల్ని శిక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు తరుణ్, రాజేష్, ప్రేమ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment