Tuesday, 21 August 2018

కేరళ వరద బాధితుల కోసం విరాళాల సేకరణ

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 21 ; రెబ్బెన మండలం లొ బెటర్ యూత్ బెటర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కేరళలోని వరద బాధితుల కోసం విరాళాలు సేకరణ కార్యక్రమం చేపట్టారు. గోలేటి దుకాణాలలో మరియు రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు జడ్పీఎస్ఎస్ పాఠశాలలో విరాళాలు సేకరించడం జరిగింది. సేకరించిన అటువంటి విరాళాలు మరియు దుస్తులు సబ్బులు నిత్యావసర సరుకులు జిల్లా కలెక్టర్ గారి ద్వారా పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మానవత్వం తో  తోచినంత సహాయం చేయాలని వారు కోరారు. వాళ్లకి మనం ఒక పూట అన్నం పెట్టిన వాళ్లమవుతాం . మనం వృధాగా ఎన్నో ఖర్చులు చేస్తూ ఉంటాం. వృథాగా చేస్తే అటువంటి ఖర్చులు వీరి కోసం సహాయం చేయాలని కోరారు. సంస్థ అధ్యక్షులు ఓరగంటి రంజిత్ కుమార్ , ఉపాధ్యక్షులు నామాల రాజశేఖర్, రవీందర్ ప్రధాన కార్యదర్శి జనగామ అజయ్, సభ్యులు పి.తిరుపతి ,s.రాజేష్ ,e.తిరుపతి,సత్యనారాయణ,b. తిరుపతి. తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment