కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 12 ; సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో గుర్తింపు సంఘం టిబిజికెఎస్ రాజి లేని పోరాటం చేస్తున్నద ని టిబిజికెఎస్ గోలేటి ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్ లోని టిబిజికెఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమాశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో ముఖ్య మంత్రికి కెసిఆర్, టిబిజికెఎస్ గౌరవ అధ్యక్షురాయలు ఎం పి కవిత ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తున్నామన్నారు ముఖ్యంగా క్యాడర్ స్కీం అమలువిషయంలో నాయకులు ఇప్పటికే కవిత ను కలవడం జరిగిందన్నారు. కార్మికులకు ఇల్లు కట్టుకోవడానికి పది లక్షల రూపాయల వడ్డీలేని ఋణం మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సంస్థ లాభాలలో కార్మికులకు న్యాయంగా రావాల్సిన వాటా కోసం చర్చలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ నాయకులూ పాల్గొన్నారు.
No comments:
Post a Comment