కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 06 ; రెబ్బెన మండలం నెర్పల్లి గ్రామ మండలప్రజా పరిషత్ పాఠశాలలో ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుల వీడ్కోలు సమావేశంసోమవారం జరిగింది. బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులు చెర్లోపల్లి నాగరాజు, శాయిని సంధ్యారాణిలకు గ్రామస్తుల ఆధ్య్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కల్వల శంకర్, పిఆర్టియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల సదానందం ముఖ్య అతిధులుగాహాజరై గత 8 ఏళ్లుగా ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా ఉంటూ పిల్లలను శ్రద్దగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్ది బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను శాలువాతో సన్మానించి వారి సేవలను కొనియాడారు..ఈ సన్మాన కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మందాడి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.బదిలీ ఐన ఉపాధ్యాయులు గత 8 సంవత్సరాలుగా పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి ,వారిని బాగా చదువుకునేలా తీర్చిదిద్దారని పలువురు వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎం సీ చైర్మన్ మొర్లే నన్నయ్య, మాజీ సర్పంచ్ మొర్లే మంతు మేర ,సెండే గంగుమేర, జాకిర్ ఉస్మాని, పి ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు కాల్వల శంకర్ , పి ఆర్ టి యు జిల్లా ఉపాధ్యక్ష్యులు బత్తుల సదానందం, పి ఆర్ టి యు నాయకులూ ఖదీర్ మొయినుద్దీన్, సునార్కర్ అనిల్, దొడ్డిపట్ల రవి కుమార్, పాఠశాల సహ ఉపాధ్యాయులు దుర్గం జనార్దన్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వై, సోమశేఖర్, టి శ్రీనివాస్, వి శ్రీధర్, రమణ, సత్యనారాయణ, హన్మంతరావు, రవి, గోపాల్, శ్రీనివాస్, ఎం వి ఎం కుమార్, సూర్యనారాయణ, గ్రామస్తులు వినోద్, శంకర్, శ్రీను, నగేష్, చంద్రుమేర, అదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment