Wednesday, 29 August 2018

ప్రజల్ని మభ్యపెడుతున్న తెరాస ప్రభుత్వం : జిల్లా బీజేపీ అధ్యక్షులు జె బి పౌడెల్

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 29 ; తెరాస ప్రభుత్వం ప్రజల సమస్యలు గాలికి వదిలేసి స్వార్థ రాజకీయాలకు పాల్పడుతుందని జిల్లా బీజేపీ అధ్యక్షులు జె  బి పౌడెల్ అన్నారు.  బుధవారం రెబ్బెన మండల కేంద్రంలో గోలేటి, నంబల. నారాయపూర్, గంగాపూర్, పుంజుమేరగుడా, తక్కల పల్లి, పులికుంటా, కిష్టపూర్, కైర్ గాం, నవేగాం గ్రామాలలో మోటార్ సైకిల్ ర్యాలీని నిర్వహించారు.  అనంతరం మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలుచేసే వివిధ పథకాల్ని రాష్ట్రప్రభుత్వం  తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుందని, కేంద్రప్రభుత్వ అనేక పథకాలను ప్రెవేశ పెట్టి వాటి అమలుకు రాష్ట్రాలకు నిధుల పంపిణి చేస్తోందని, కానీ రాష్ట్రప్రభుత్వాలు వాటిని తాము ప్రెవేశపెట్టిన పథకాలుగా ప్రచారం చేసి ప్రజలను మభ్య పెడుతున్నాయని ఆన్నారు. నిజాలను ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ బైక్ ర్యాలీని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోనగిరి సతీష్ బాబు రెబ్బెన మండల అధ్యక్షుడు కుందారం బాలకృష్ణ మండల ప్రధాన కార్యదర్శి పస్తేమ్ పొశం  తెలంగాణ విమోచన కమిటీ జిల్లా కన్వెనర్ జనగామ విజయ్ కుమార్ OBC మోర్చా జిల్లా అధ్యక్షుడు తిరుపతి, BJYM జిల్లా కార్యదర్శిలు అరికిల్ల శేఖర్ బతిని రాము BJYM మండల ప్రధాన కార్యదర్శి కోట రాజేశ్వర్ JBP యువసేన ప్రధాన కార్యదర్శి అజ్మెరా ప్రశాంత్. అఖిల్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

No comments:

Post a Comment