Tuesday, 21 August 2018

ప్లకార్డులతో గ్రామ పంచాయతీ కార్మికుల నిరసన

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 21 ; గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని కోరుతూ రెబ్బెన మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న  కార్మికులు మంగళ వారం ప్లకార్డు లు పట్టుకొని నిరసన తెలిపారు.  నిరవదిక సమ్మె మంగళ వారానికి 30 వ రోజుకు చేరుకుంది.    ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,   మాట్లాడుతూ ముఖ్యమంత్రి కి  గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే  విధంగా చేయాలని అన్నారు.  అలాగే మంత్రి  కే టి ఆర్ కు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా చేయాలని కోరారు. కనీస వేతనం 18 వేలు ఇవ్వాలని, అర్హులైన  వారందరిని పంచాయతీ కార్యదర్శి గా నియమించాలి  అని కోరారు.  పక్క రాష్ట్రంలో ఇస్తున్నట్లు వేతనాలు ఇవ్వాలని, కర్ణాటక రాష్ట్రము వలే ప్రత్యేక గ్రాంట్ కేటాయింపు చేయాలని అన్నారు. హక్కులు సాధించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని అన్నారు. ముఖ్యమంత్రి రోజుకో ప్రకటన చేస్తూ కార్మికులను గందరగోళం గా తయారు చేస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిస్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్,లాలు సింగ,కోశాధికారి కళావేని తిరుపతి, నాయకులు బాబాజి,సత్యయ్య ,వెంకటేష్  తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment