Saturday, 4 August 2018

గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ; సొల్లులక్ష్మి

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 04 ; రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లులక్ష్మి అన్నారు. రెబ్బెన మండల కేంద్రంలో  తహశీల్ధార్ కార్యాలయం ఎదుట గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం 13 వ రోజుకు చేసుకుంది. ఈ  సమ్మెకు టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సొల్లులక్ష్మి మద్దతు ప్రకటించి, శిబిరం వద్ద మాట్లాడుతూ    అర్హులైన  వారందరిని కార్యదర్సుకుగా  గా నియమించాలని అన్నారు. తెరాస ప్రభుత్వం  ఎన్నికలముందు ఇచ్చిన దళితులకు  3 ఎకరాల భూమి,లక్ష ఉద్యోగాల  హామీలను అటకెక్కించి  గత నాలుగేళ్లుగా ప్రజలను మభ్యపెడుతున్నదని అన్నారు. రాబోయే 2019 ఎన్నికలలో ప్రజలు ఈ విషయాలను గమనించి తగిన బుద్ది    చెపుతారని అన్నారు. 13 వ రోజు దీక్షలో   ఈ దీక్షలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బోగే ఉపేందర్, జి పి  డబ్ల్యూ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్, కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్, కార్మికులు  సునీల్, దేవాజి, వీరయ్య, నారాయణ,లక్ష్మి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

                            

No comments:

Post a Comment