కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 12 ; విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ఏ ఐ ఎస్ ఎఫ్ ముందుంటుందని ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్ అన్నారు. ఆదివారం రెబ్బెన మండల కేంద్రం ప్రధాన కూడలి వద్ద ఏ ఐ ఎస్ ఎఫ్ 83వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జండా ఎగురవేసి మాట్లాడారు. విద్యారంగంలోని అనేక సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కే జి నుండి పి జి వరకు ఉచితవిద్య హామీని నెరవేర్చాలన్నారు. ప్రత్యేకంగా వెనుకబడిన కుమ్రంభీం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నత విద్యను ప్రైవేటీకరణ చేస్తున్నదని , ఇందులో భాగంగా ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నద ని అన్నారు. యూనివర్సిటీలలో మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాద ని అన్నారు. విద్యారంగ సమస్యలపై శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తుంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రవికుమార్, డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, డివిజన్ ఉపాధ్యక్షులు పార్వతి సాయి, మండల అధ్యక్షులు జాడి సాయి, నాయకులూ కమల్, సంపత్, సంజయ్, శివ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment