Tuesday, 14 August 2018

ప్రాధమిక పాఠశాలలోఅభ్యాసన పుస్తకాల పంపిణి


కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 14 ;  రెబ్బన మండల నక్కల గూడా ప్రాధమిక పాఠశాలలో మంగళ వారం  పి  ఆర్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బత్తుల సదానందం, జిల్లా ఉపాధ్యక్షులు కల్వల  శంకర్ లు  వితరణ చేసిన అభ్యాసన పుస్తకాలను పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా పాల్గొన్న రెబ్బెన ఎం ఈ ఓ  వెంకటేశ్వర స్వామి చేతుల మీదుగా  పంచిపెట్టడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల  శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎం ఈ ఓ మాట్లాడుతూ దేశం 72 వ స్వతంత్ర ఇనోత్సవాన్ని జరుపుకుంటున్నదని, ఎందరో మహాత్ముల త్యాగఫలమైన స్వాతంత్ర్యాన్ని మనం అనుభవిస్తున్నామన్నారు. ఈ తరుణంలో వారిని స్మ రించుకోవడం ఎంతో  అవసరమన్నారు. ముఖ్యంగా పిల్లలు మరింత బాధ్యతతో మెలగాలని, శ్రద్ధగా చదువుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలోపి  ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సదానందం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్,  ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్, తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment