Thursday, 9 August 2018

ఓటమిపాలైన అవిశ్వాసం

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 09;  రెబ్బెన మండల ఎంపీపీ పై ప్రెవేశ పెట్టిన అవిశ్వాసతీర్మానం ఓటమి పాలైంది. ఎంపీపీ సంజీవ్ కుమార్ పై ఏడుగురు ఎంపీటీసీ లు ప్రెవేశపెట్టిన తీర్మానం పై  గురువారం ఆర్ డి ఓ కదం సురేష్ అధ్యక్షతన జరిగినసమావేశానికి అవిశ్వాస తీర్మానంపై సంతకం చేసిన ఒక ఎంపీటీసీ సమావేశానికి హాజరు కాకపోవడంతో సంఖ్యాబలం లేక  వీగిపోయిందని  ఆర్ డి ఓ ప్రకటించినట్లు సమాచారం. నాటకీయ పరిణామాలతో జరిగిన ఈ అవిశ్వాసతీర్మానంపై సమావేశాన్ని ఈ రోజు అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు  మధ్య కనీసం విలేఖరులకు కూడా ప్రేవేశంలేకుండా నిర్వహించారు. అసమ్మతి వర్గంలోని ఎంపీటీసీ శ్రీమతి టేకం  మంగను వైస్ ఎంపీపీ భర్త, కుమారులు కిడ్నప్ చేసినట్లు  భర్త టేకం  రామయ్య ( సమ్మతి వర్గం ఎంపీటీసీ) రెబ్బెన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.   అత్యంత నాటకీయంగా  గత 20 రోజులుగా క్యాంపు లో ఉన్న  అసమ్మతి ఎంపీటీసీ లు అంబులెన్సులో సమావేశ ప్రాంగణమైన ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చారు. సమావేశం మొదటి అంతస్తులో ఉండడంతో అసమ్మతి వర్గంలోని ఒక ఎంపీటీసీ శ్రీమతి టేకం  మంగ అనారోగ్యకారణంగా మెట్ల వద్దనే ఆగిపోయి  సమావేశానికి వెళ్లకుండా  అంబులెన్సులో ఆసుపత్రికి  వెళ్లిపోయినట్లు సమాచారం.

No comments:

Post a Comment