Tuesday, 28 August 2018

ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలోఅల్పాహార పంపిణి

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 28 ; మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం రెబ్బెన టౌన్  తెరాస మహిళా   అధ్యక్షురాలు మన్యం పద్మ గర్భిణీ స్త్రీలకు  పులిహోరను అల్పాహారం గా అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలనుంచి  పరీక్షలకై  వచ్చే గర్భిణీ స్త్రీలకు తన వంతు ధర్మంగా  అల్పాహారం క్రమం తప్పకుండా అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం  కల్పిస్తున్న అవకాశాలతో  పాటుగా సమాజంలోని అందరు సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పావని, సునీత, ఆరోగ్యమిత్ర లావణ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment