కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 07 ; మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం తెరాస మండల మహిళా పట్టణ మహిళ అధ్యక్షురాలు మన్యం పద్మ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు పులిహోర పంపిణి చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా ఆసిఫాబాద్ ఎం ఎల్ ఏ కోవలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస మహిళా విభాగం ఆధ్వర్యం లో ప్రతి మంగళవారం చేపట్టే కార్యక్రమం ఎంతో సూర్తి దాయకమన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ కుందారపుశంకరమ్మ, సీనియర్ నాయకురాలు అరుణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment