కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ఆగష్టు 27 ; మండల కేంద్రంలో మరుగు దొడ్లు నిర్మించాలని కోరుతూ సి పి ఐ , ఆ ఐ ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ సాయన్నకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి దుర్గం రవీందర్ మాట్లాడుతూ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్, విద్యుత్ సబ్ స్టేషన్, రెండు బ్యాంకు శాఖలు, ఒక సహకార బాంక్, బస్సు స్టాండ్, రైల్వే స్టేషన్ ఉండడంతో మండలం లోని గ్రామాల ప్రజలు వందల సంఖ్యలో వస్తారని, కానీ మండల కేంద్రంలో మరుగు దొడ్లు లేకపోవడంతో ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున ప్రజల సౌకర్యార్ధం మరుగు దొడ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సి పి ఐ మండల కార్యదర్శి రాయిలా నర్సయ్య, ఆ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి, నాయకులు జాడి సాయి, రమేష్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు రాచకొండ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment