Tuesday, 21 August 2018

పాఠశాల సంప్ లో పడి చిన్నారి మృతి

 
కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 21 ; రెబ్బెన మండలం కొండపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం దీక్షిత అనే 3 సంవత్సరాల చిన్నారి   ప్రమాదవశాత్తు నీటి సంప్  లో పడి మరణించిందని రెబ్బెన ఎస్సై దీకొండ  రమేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం  కొండపల్లి  ప్రాధమిక పాఠశాలలో  స్వీపర్ గా   విధులు నిర్వహిస్తున్నపద్మ  మధ్యాహ్న సమయంలో బాలికను వెంటతీసుకుని వెళ్లి  సంప్ మూతతీసి మరుగుదొడ్లు శుభ్రం చేస్తుండగా బాలిక ప్రమాదవశాత్తు సంప్ లో  పడటంతో అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు హుటాహుటిన ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తర లించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారని తెలిపారు.  సంఘటన స్థలాన్ని రెబ్బెన  ఇన్సపెక్టర్  రమణ మూర్తి పరిశీలించారు.

No comments:

Post a Comment