Tuesday, 14 August 2018

హరితహారం, సీజనల్ వ్యాధులపై కళాజాత

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 14 ; హారితహరం  ప్రయోజనాలు, సీజనల్ వ్యాధుల అప్రమత్తత పై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాజాత కార్యక్రమాన్నిమంగళ వారం రెబ్బన మండల కేంద్రంలో నిర్వహించారు. వర్షాకాలంలో   వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒకరు తమ భాద్యత గా అనుకోని మొక్కలు నాటి వాటిని పెంచాలని తెలియచెప్పారు. ఈ కార్యక్రమంలో  కళాకారులు కొప్పర్తి సురేందర్, గొడిశెల బాపు,రామటెంకి రాజతిరుపతి, గొడిశెల కృష్ణ, యం.డి. ఇర్ఫాన్ హుస్సేన్, శ్రీరాముల సమ్మయ్య, మిట్టపల్లి సంధ్య,గుండా శిరీష పాల్గొన్నారు.

No comments:

Post a Comment