Monday, 13 August 2018

ప్రహరీ గోడ నిర్మాణానికి వినతి



కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన ఆగష్టు 13 ; రెబ్బెన మండలంలోని నేర్పాలి, నక్కలగూడ ప్రాధమికపాఠశాలలకు ప్రహరీ గోడ నిర్మించుటకు రెబ్బెన ఎంపీపీ కార్నాధం సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో ఎం ఎల్ ఏ  కోవా లక్ష్మి కి  సోమవారం వినతి పత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎం ఎల్ ఏ  సానుకూలంగా స్పందించి ప్రహరీ గోడ నిర్మాణానికి హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తో పాటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్, మందాడే  శ్రీనివాస్, గ్రామ విద్య కమిటీ చైర్మన్ లు మీసాల పోషమల్లు, మొర్లే  నానయ్య , సభ్యులు పూదరి భీం రావు, అంకెల హన్మంతు, నీకొదే శంకర్, గుర్ల శంకర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment