Tuesday, 28 August 2018

గ్రామాలకు మొక్కల పంపిణి

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 28 ; రెబ్బెన  మండల కేంద్రంలోని ఫారెస్ట్ నర్సరీ నుండి మండలంలోని గ్రామాలకు మొక్కలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా రెబ్బెన ఎంపీడీవో  సత్యనారాయణ సింగ్ మాట్లాడుతూ తెలంగాణా ప్రభుత్వం ఎంతో  ప్రతిష్టాత్మకంగాప్రారంభించిన  హరిత హారం కార్యక్రమాన్ని మండలంలోని ప్రజలందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని అన్నారు. గ్రామాలలో ప్రజలందరూ మొక్కలునాటి వాటిని సంరక్షించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఏ  పి  ఓ కల్పన, పంచాయతీ సెక్రటరీలు శంకర్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment