Tuesday, 21 August 2018

కేరళ వరద బాధితుల కోసం విరాళల సేకరణ

  కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 21 ;  కేరళ వరద బాధితుల కోసం అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF ఆధ్వర్యంలో విరాళల సేకరణ చేపట్టడం జరిగింది.  గోలేటి దుకాణాలలో మరియు రెబ్బెనలో విరాళాలు సేకరించిన అటువంటి విరాళాలు మరియు దుస్తులు సబ్బులు నిత్యావసర సరుకులు పంపడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మానవత్వం తో  తోచినంత సహాయం చేయాలని వారు కోరారు.  ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్, ఉపాధ్యక్షుడు పర్వతి సాయికుమార్, AIYF జిల్లా ఉపాధ్యక్షుడు చునార్కర్ మహేందర్, నాయకులు రాకేష్,  ముద్దసాని శ్రావణ్, సిడాం సాగర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment