Friday, 31 August 2018

శక్తి ప్రాజెక్ట్ నమోదు మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పర్యటన

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 31 ; కాంగ్రెస్ పార్టీ శక్తి ప్రాజెక్టు కార్యక్రమం చివరి రోజు  భాగంగా టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు శుక్రవారం రెబ్బెనలో పర్యటనంచారు. శక్తి ప్రాజెక్టులో నమోదు చేసిన వారి సంఖ్య బూత్ల వారీగా సేకరించి ఏమైనా జాప్యం జరిగి ఉన్నట్లయితే తెలియచేయాలని కార్యకర్తలకు సూచించారు. అనంతరం నాయకులతో సమావేశం నిర్వహించి   తెలిపినారు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో బూత్ అధ్యక్షులకు సముచిత న్యాయం పార్టీలో కీలక పదవులు దక్కేలా చర్యలు తీసుకుంటామన్నరు  గ్రామ గ్రామాన సందర్శించి కాంగ్రెస్ పార్టీ గురించి వివరిస్తూ శక్తి ప్రాజెక్టులో అధిక సంఖ్యలో నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కేతు  అధ్యక్షులు బాలేశ్వర గౌడ్ యూత్ కాంగ్రెస్ నాయకులు శైలేందర్, పార్టీ అధ్యక్షుడు ముంజం రవీందర్, నంబల ఎంపిటిసి కొవ్వూరి శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ గాజుల రవీందర్, వైస్ ఛైర్మన్, వెంకటేశం చారి, ఉపాధ్యక్షులు దుర్గ రాజేష్, సోషల్ మీడియా గందె  సంతోష్, నాయకులు వెంకన్న, భీమ్రావు, గంగయ్య ,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment