Saturday, 25 August 2018

మొక్కల పెంపకంపై అవగాహన పెంపొందిచుకోవాలి

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 25 ; పర్యావరణం, మొక్కల పెంపకంపై   అవగాహన పెంపొందించుకోవాలని రెబ్బెన ఎంపీడీవో  సత్యనారాయణసింగ్, మండల విద్యాధికారి వేంకటేశ్వరస్వామి లు  అన్నారు. శనివారం  రెబ్బెన మండలం నక్కలగూడ  గ్రామా ప్రాధమిక పాఠశాల విద్యార్థులు శనివారం గ్రామంలో  నిర్వహించిన  హరిత హారం  ర్యాలీ  లో పాల్గొని మాట్లాడారు..విద్యార్థులు మొక్కలకు నీళ్ళుపోసి పెంచి పెద్ద చేసే అలవాటు పెంపొందించుకోవాలని  అన్నారు. అనంతరం విధ్యార్దులతో మరియు గ్రామస్తులతో హరితహారం ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి, అక్తరోద్దిన్, బీట్ అధికారులు రవి, మహేష్, పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ ఈ పోషమల్లు,  పాఠశాల ప్రధానోపాధ్యాయులు కల్వల శంకర్,   ఉపాధ్యాయులు దేవరకొండ రమేష్ , విద్యార్థులు,  గ్రామస్తులు పాల్గొన్నారు.  

No comments:

Post a Comment