Wednesday, 8 August 2018

నిరవధిక సమ్మె రోజులు గడుస్తున్నాపట్టించుకోని ప్రభుత్వం

కొమురంభీం ఆసిఫాబాద్ ; రెబ్బెన  ఆగష్టు 08; :గ్రామ పంచాయితి కార్మికులు చేపట్టిన సమ్మె చేపట్టి  17వ రోజు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదని వెంటనే స్పందించి కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు రెబ్బెన తహసీల్దార్ సాయన్నకు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు బోగే ఉపేందర్, టిఆర్ఎస్ కెవి జిల్లా కార్యదర్శి నాగవల్లి సుధాకర్లు మాట్లాడుతూ గ్రామపంచాయతి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పార్శీకరించాలని కోరుతు కార్మికులు  చేపట్టిన సమ్మె రోజులు గడుస్తున్న కొద్ది ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడకుండా కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండ కార్మికులను చిన్నచూపు చూస్తుందని అన్నారు ఇప్పడికైనా ప్రభుత్వం పట్టించుకోని   అర్హులైన కార్మికులందరిని  కార్యదర్శి గా నియమించి, .జి ఓ  సవరించి అందరిని పెర్మనెంట్  చేయాలని అన్నారు. కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చెసారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో .ఏఐటీయూసీ జిపిడబ్ల్యూ యూనియన్ మండల అధ్యక్షుడు రాచకొండ రమేష్, కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్, కార్మికులు దేవాజి, వీరయ్య, నారాయణ,లక్ష్మి, రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment