Wednesday, 22 August 2018

ప్రభుత్వ బెదిరింపులకు బయపడం : ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 22 ;  గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు గత 31 రోజుల నుంచి తమ హక్కుల కోసం సమ్మె చేస్తుంటే, ప్రభుత్వం విధుల్లోకి చేరకుంటే తొలగిస్తామని బెదిరించడం  చేతగాని తనం అని అన్నారు, కేసీఆర్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని అన్నారు.   కార్మికుల ఆధ్వర్యంలో నిరసన గా బుధవారం రెబ్బెన మండల కేంద్రంలోని అతిధి గృహ ఆవరణలో ఏఐటీయూసీ  జిల్లా కార్యదర్శి భోగే ఉపేందర్ ఆధ్వర్యంలో  ప్రభుత్వం  ఇచ్చిన ఉత్తర్వులను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హక్కులు సాధించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తేలేదని అన్నారు,ప్రభుత్వం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత  ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్, మాటకు కట్టుబడి ఉండాలని అంన్నారు,4 ఏండ్ల కాలంలో ఏనాడు పట్టించుకోకుండా శ్రమదోపిడికి గురి చేస్తూ,కార్మిక చట్టాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు, ప్రభుత్వం రోజుకో ప్రకటన చేస్తూ కార్మికులని గందరగోళానికి  గురిచేస్తున్నారని,ఇప్పటికైనా ప్రభుత్వనికి కార్మికులపై ప్రేమ ఉంటే చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని,లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అన్నారు,8500 జీతం ఇస్తామని చెపుతున్న ప్రభుత్వం..దానిపై ఇప్పటివరకు సరియైన స్పష్టత ఇవ్వ లేదు అని అన్నారు. ప్రభుత్వం కార్మికులపై సవితి తల్లి ప్రేమ చూపించడం సరి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ కె  వి   జిల్లా కార్యదర్శి నగవేల్లి సుధాకర్,ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య,గ్రామ పంచాయతీ మండల ప్రెసిడెంట్ రాచకొండ రమేష్,కార్యదర్శి దుర్గం వెంకటేష్,వైస్ ప్రెసిడెంట్ గోగర్ల శంకర్,సహాయ కార్యదర్శి పోశం, కోశాధికారి కళావేని తిరుపతి నాయకులు ప్రకాష్,బాబాజీ,దేవాజి, శంకర్ లు ఉన్నారు.










No comments:

Post a Comment