Tuesday, 28 August 2018

సంజీవని సేవ సంస్థ ఆధ్వర్యంలో హరిత హారం

 కొమురంభీం ఆసిఫాబాద్  రెబ్బెన  ఆగష్టు 28 ;  సంజీవని సేవ సంస్థ ఆధ్వర్యంలో   రెబ్బెన మండల కేంద్రంలోని    1వ   నెంబర్ అంగన్వాడి    కేంద్రంలో మంగళవారం  నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక  అధ్యక్షులు దీకొండ  సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో  దూరదృష్టితో మొదలు పెట్టిన హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ప్రజలందరూ తమ భాద్యతగా తీసుకోవాలని అన్నారు. తమ సంస్థ తరఫునుంచి ప్రజలలో అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటి వాటిని పెంచి పెద్దచేయడంద్వారా వేసవిలో మండుటెండలనుండి ఉపశమనం పొందవచ్చన్నారు. భూగర్భజలాల మట్టంకుడా పెరిగే అవకాశమున్నదన్నారు. ఈ కార్యక్రమంలో      ప్రభుత్వ ఉపాద్యాయులు ఈశ్వర్, సభ్యులు డి . విజయ కుమారి, వై సుజాత, ఎస్ డి రేష్మ , విద్యార్థులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment